క్రైమ్

Baby Sale Case Warangal: నాలుగు నెలల పసికందును రూ.2.90 లక్షలకు విక్రయించిన ముఠా అరెస్ట్.. 12 మందిపై కేసు!

 నాలుగు నెలల పసికందు.. ఇంకా అమ్మ ఒడిలో వెచ్చదనం, నాన్న చేతిలో ఆప్యాయత కోరుకునే ప్రాయం.. కానీ ఆ పసి హృదయాన్ని కన్నతల్లిదండ్రులు కనికరించలేదు. ఆర్థిక కష్టాల సాకుతో ఆడపిల్ల పోషణే భారంగా భావించారు. పాతకాలపు మూఢత్వం ఒకవైపు.. డబ్బుల కక్కుర్తి మరోవైపు.. వెరసి కన్నబిడ్డనే సంతలో సరుకులా మర్చేసింది. మద్యానికి బానిసైన తండ్రి, కన్నప్రేమను విస్మరించిన తల్లి, పెద్దలుగా దారి చూపాల్సిన తాతయ్య-అమ్మమ్మ.. ఇలా కుటుంబసభ్యులంతా ఆ పసిబిడ్డను బేరానికి పెట్టి రూ.2.90లక్షలకు విక్రయించారు.  ఈ అమానవీయ ఘటన తెలంగాణలో కలకలం రేపింది. అయితే, పోలీసుల చొరవతో ఈ ముఠా గుట్టు ఎట్టకేటకు బయటపడింది.