వ్యాపారం

Gold, Silver Rates : మళ్లీ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

శుభకార్యాల ముందు బంగారం, వెండి ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి.గతంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ఆయిల్ రేట్స్ పెరగడం మూలంగా ఇన్వెస్టర్లు సెక్యూరిటీ కోసం బంగారం, వెండి మీద భారీగా పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. దీనికి తోడు భవిష్యత్‌లో బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయని భావించి వ్యాపారులు, వినియోగదారులు ఎర్లీ కొనుగోళ్లు చేశారు. ఆన్లైన్ వేదికగా గోల్డ్ బాండ్స్ కూడా విపరీతంగా అమ్ముడుపోయాయి. ఫలితంగా మార్కెట్లో డిమాండ్‌కు తగ్గ సప్లయ్ లేకపోవడంతో బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటాయి. కాగా, నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు ఇవాళ తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.3,200 తగ్గి రూ.1,24,580 లకు చేరుకోగా.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.2,950 తగ్గి రూ.1,14,200లకు చేరుకుంది.ఇక వెండి ధరలు భారీగా పతనం అయ్యాయి. కిలో వెండిపై రూ.10 వేలు తగ్గి రూ.1.65 లక్షలకు చేరుకుంది.బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండటంతో కొనుగోలు దారులు సైతం ఆచితూచి కొంటున్నారు.