వ్యాపారం

Gold, Silver Rates : మళ్లీ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

శుభకార్యాల ముందు బంగారం, వెండి ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి.గతంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ఆయిల్ రేట్స్ పెరగడం మూలంగా ఇన్వెస్టర్లు సెక్యూరిటీ కోసం బంగారం, వెండి మీద భారీగా పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే.

శుభకార్యాల ముందు బంగారం, వెండి ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి.గతంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ఆయిల్ రేట్స్ పెరగడం మూలంగా ఇన్వెస్టర్లు సెక్యూరిటీ కోసం బంగారం, వెండి మీద భారీగా పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. దీనికి తోడు భవిష్యత్‌లో బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయని భావించి వ్యాపారులు, వినియోగదారులు ఎర్లీ కొనుగోళ్లు చేశారు. ఆన్లైన్ వేదికగా గోల్డ్ బాండ్స్ కూడా విపరీతంగా అమ్ముడుపోయాయి. ఫలితంగా మార్కెట్లో డిమాండ్‌కు తగ్గ సప్లయ్ లేకపోవడంతో బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటాయి.

ముగిసిన యుద్ధం.. దిగొచ్చిన ఇంధన ధరలు..

మిడిల్ ఈస్ట్‌లో ప్రస్తుతం యుద్ధచాయలు కనిపించడం లేదు. అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ దారుణ ఓటమికి పాల్పడటంతో అధ్యక్షుడు ట్రంప్ వెనుక్కి తగ్గాల్సి వచ్చింది. దీంతో ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ముగిసిపోయినట్టే అని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇజ్రాయెల్‌లో జరిగిన ఎన్నికల్లోనూ ప్రభుత్వం పడిపోవడంతో యుద్ధం నిలిచిపోగా.. క్రమంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు దిగివచ్చాయి. దీంతో ఇన్వెస్టర్లు క్రమంగా బంగారం, వెండి మీద పెట్టుబడులు పెట్టడం తగ్గించినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

భారత ప్రధాని మోడీ సైతం బంగారం కొనొద్దని దేశ ప్రజలకు పిలుపునివ్వడంతో జనాలు ఆలోచనలో పడ్డారు. ఫలితంగా డిమాండ్ తగ్గి, సప్లయ్ పెరిగి బంగారం, సిల్వర్ ధరలు భారీగా తగ్గుతున్నాయి. నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు ఇవాళ తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.3,200 తగ్గి రూ.1,24,580 లకు చేరుకోగా.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.2,950 తగ్గి రూ.1,14,200లకు చేరుకుంది.

ఇక వెండి ధరలు భారీగా పతనం అయ్యాయి. కిలో వెండిపై రూ.10 వేలు తగ్గి రూ.1.65 లక్షలకు చేరుకుంది.బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండటంతో కొనుగోలు దారులు సైతం ఆచితూచి కొంటున్నారు. గత వారం రోజులుగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టడంతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అసలే పెళ్లిళ్ల సీజన్ కావడంతో మళ్లీ ఎక్కడ ధరలు పెరుగుతాయో అన్న భయంతో ముందే షాపింగ్ చేస్తున్నట్టు సమాచారం.

తర్వాత చదవండి