వ్యాపారం

Gold Loan: గోల్డ్‌లోన్ తీసుకున్న వారికి షాక్.. ఖాతాదారులకు బ్యాంకుల నోటీసులు!

దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు గరిష్ఠ స్థాయిల నుంచి భారీగా పతనం కావడం కొత్తగా ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఊరటనిస్తున్నప్పటికీ, బంగారం తాకట్టు పెట్టి రుణాలు (Gold Loans) తీసుకున్న ఖాతాదారులకు మాత్రం తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. తనఖా పెట్టిన బంగారం మార్కెట్ విలువ గణనీయంగా తగ్గిపోవడంతో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ (NBFC) ఆర్థిక సంస్థలు రుణగ్రహీతలకు 'మార్జిన్ కాల్' నోటీసులు జారీ చేస్తున్నాయి. బకాయి ఉన్న రుణ మొత్తంలో కొంత భాగాన్ని తక్షణమే చెల్లించాలని, లేనిపక్షంలో తగ్గిన విలువకు సమానంగా అదనపు నగదు జమ చేయడమో లేదా మరింత బంగారాన్ని అదనపు తనఖాగా పెట్టడమో చేయాలని ఆయా సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.