వ్యాపారం
Gold price today Nov 24: రూ.1.30లక్షలు దాటిన పసిడి.. నవంబర్ 24న తాజా రేట్లు ఇవే!
దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి(Gold, silver price) ధరలు మంగళవారం మరోసారి భారీగా ఎగబాకాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, ముడిచమురు ధరల్లో మార్పులు, రూపాయి మారకం విలువతో పాటు కొనుగోళ్ల డిమాండ్ పెరగడంతో పసిడి, వెండి రేట్లు వరుసగా రెండో రోజు పైకి ఎగబాకినట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. క్యాప్స్ గోల్డ్ (Caps Gold) వెబ్సైట్ గణాంకాల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో సోమవారం రూ. 1,28,541గా ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం ధర, మంగళవారం నాటికి రూ.1,709 పెరిగి రూ.1,30,250 మార్కును తాకింది.
