వ్యాపారం
Gold price today nov 21: మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. నవంబర్ 21న తాజా రేట్లు ఇవే!
దేశీయ బులియన్ మార్కెట్లో పుత్తడి, వెండి ధరల తగ్గుదల శనివారం నాలుగో రోజు కొనసాగింది. క్యాప్స్ గోల్డ్ వెబ్సైట్ గణాంకాల ఆధారంగా.. హైదరాబాద్లో శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,160గా ఉండగా, శనివారం నాటికి రూ.1,710 తగ్గి రూ.1,26,450 వద్దకు చేరుకుంది. ముంబై, బెంగళూరు నగరాలతో పాటు విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,15,100గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 3,525 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
