దేశీయ బులియన్ మార్కెట్లో పుత్తడి, వెండి ధరల తగ్గుదల శనివారం నాలుగో రోజు కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, ముడిచమురు ధరలు, రూపాయి మారకం విలువ, సరఫరా వ్యవస్థలో మార్పులు, కొనుగోళ్లలో హెచ్చుతగ్గులు పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు వెల్లడించారు. శనివారం నాటి తాజా వివరాల ప్రకారం.. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాలు, ఇతర ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు దిగిరావడంతో కొనుగోలుదారులకు కాస్త ఊరట లభించింది.
క్యాప్స్ గోల్డ్ వెబ్సైట్ గణాంకాల ఆధారంగా.. హైదరాబాద్‌లో శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,160గా ఉండగా, శనివారం నాటికి రూ.1,710 తగ్గి రూ.1,26,450 వద్దకు చేరుకుంది. ముంబై, బెంగళూరు నగరాలతో పాటు విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,15,100గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 3,525 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
పసిడి ధరలతో పాటు వెండి ధరలు సైతం శనివారం తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో శుక్రవారం కిలో వెండి ధర రూ.1,54,900గా ఉండగా, శనివారం నాటికి రూ.1,789 తగ్గి రూ. 1,53,111కు దిగివచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ సిల్వర్ ధర 41.12 డాలర్ల వద్ద కొనసాగుతోంది. పారిశ్రామిక అవసరాలు, పెట్టుబడిదారుల డిమాండ్, అంతర్జాతీయ పరిణామాల కారణంగా వెండి రేట్లలో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి.
పెళ్లిళ్లు, పండగలు, శుభకార్యాల వేళ ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు ధరతో పాటు స్వచ్ఛత, హాల్‌మార్క్, బిల్లు వివరాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. బంగారం బరువు, పొదిగిన రాళ్ల బరువు, వాటి ధరలు, తయారీ ఛార్జీలు, పన్నులను బిల్లులో విడివిడిగా స్పష్టంగా నమోదు చేయించుకోవాలి. భవిష్యత్తులో ఆదాయపు పన్ను శాఖ ప్రశ్నలు తలెత్తితే మూలాన్ని చూపేందుకు బిల్లులను భద్రపరచుకోవాలి. నకిలీ హాల్‌మార్క్‌ల పట్ల అప్రమత్తంగా ఉంటూ, బీఐఎస్ ప్రమాణాలు, తిరిగి విక్రయించే నిబంధనలను ముందుగానే నిర్ధారించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
