వ్యాపారం

GoldRateToday: భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఇవే!

బంగారం(Gold), వెండి(Silver) ఆభరణాలు కొనుగోలు చేయాలని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సామాన్యులకు శుభవార్త. అంతర్జాతీయ మార్కెట్‌తో పాటు దేశీయ బులియన్ మార్కెట్లోనూ పసిడి, వెండి ధరలు(Gold Silver Prices) భారీగా దిగివస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో ఒక్క రోజులోనే 10 గ్రాముల బంగారంపై సుమారు రూ. 3,000 వరకు ధర తగ్గింది. ప్రస్తుతం భాగ్యనగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,33,250 వద్ద కొనసాగుతుండగా, ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,22,140 వద్ద ట్రేడ్ అవుతోంది.