తెలంగాణ

Chicken prices : చికెన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. భారీగా పడిపోయిన ధరలు!

చికెన్ ప్రియులకు అదిరిపోయే శుభవార్త. మొన్నటివరకు పెరుగుతూ వెళ్లిన ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. నెలకిందట కేజీ చికెన్ రూ.300లకు పైగా పలికింది.అది కాస్త ఇప్పుడు దిగివచ్చింది. కేవలం తెలంగాణలోనే కాదు. ఏపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గత వారంతో పోలిస్తే ప్రస్తుతం చికెన్ ధరలు మళ్లీ దిగి వచ్చాయి. మరికొన్ని ప్రాంతాల్లో యథావిధిగా కొనసాగుతున్నాయి. చికెన్ ధరలు తగ్గుముఖం పట్టడానికి కార్తీకమాసం కారణమని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మార్కెట్లో మటన్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో మటన్‌ను కొనలేని సామాన్యులు చికెన్ కొనుగోలు చేస్తున్నారు. మొన్నటివరకు చికెన్‌కు డిమాండ్ అధికంగా ఉంది.అందుకు తగినట్టు సప్లయ్ లేకపోవడంతో ధరలు ఆకాశన్నంటాయని వ్యాపారవర్గాలు వెల్లడించాయి.ప్రస్తుతం కార్తీకమాసం కావడంతో చాలా మంది నాన్‌వెజ్‌కు దూరంగా ఉంటున్నారు.ఈ క్రమంలోనే చికెన్‌కు డిమాండ్ తగ్గడంతో ధరలు తగ్గుముఖం పట్టినట్టు తెలిసింది.