తెలంగాణ

Chicken prices : చికెన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. భారీగా పడిపోయిన ధరలు!

చికెన్ ప్రియులకు అదిరిపోయే శుభవార్త. మొన్నటివరకు పెరుగుతూ వెళ్లిన ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. నెలకిందట కేజీ చికెన్ రూ.300లకు పైగా పలికింది.అది కాస్త ఇప్పుడు దిగివచ్చింది. కేవలం తెలంగాణలోనే కాదు. ఏపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గత వారంతో పోలిస్తే ప్రస్తుతం చికెన్ ధరలు మళ్లీ దిగి వచ్చాయి.

చికెన్ ప్రియులకు అదిరిపోయే శుభవార్త. మొన్నటివరకు పెరుగుతూ వెళ్లిన ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. నెలకిందట కేజీ చికెన్ రూ.300లకు పైగా పలికింది.అది కాస్త ఇప్పుడు దిగివచ్చింది. కేవలం తెలంగాణలోనే కాదు. ఏపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గత వారంతో పోలిస్తే ప్రస్తుతం చికెన్ ధరలు మళ్లీ దిగి వచ్చాయి. మరికొన్ని ప్రాంతాల్లో యథావిధిగా కొనసాగుతున్నాయి. చికెన్ ధరలు తగ్గుముఖం పట్టడానికి కార్తీకమాసం కారణమని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

మార్కెట్లో మటన్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో మటన్‌ను కొనలేని సామాన్యులు చికెన్ కొనుగోలు చేస్తున్నారు. మొన్నటివరకు చికెన్‌కు డిమాండ్ అధికంగా ఉంది.అందుకు తగినట్టు సప్లయ్ లేకపోవడంతో ధరలు ఆకాశన్నంటాయని వ్యాపారవర్గాలు వెల్లడించాయి.ప్రస్తుతం కార్తీకమాసం కావడంతో చాలా మంది నాన్‌వెజ్‌కు దూరంగా ఉంటున్నారు.ఈ క్రమంలోనే చికెన్‌కు డిమాండ్ తగ్గడంతో ధరలు తగ్గుముఖం పట్టినట్టు తెలిసింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో చికెన్ ధరలను ఒకసారి పరిశీలిస్తే.. హైదరాబాద్‌‌లో కేజీ స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.200 నుంచి రూ.220 మధ్య విక్రయిస్తున్నారు. కామారెడ్డిలో కేజీ చికెన్ ధర రూ.220 నుంచి రూ.230 వరకు పలుకుతోంది. వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్‌లలో కేజీ చికెన్ రూ.200 నుంచి 250 మధ్య పలుకుతున్నట్టు సమాచారం.

గత వారంతో పోలిస్తే చాలా ప్రాంతాల్లో ధరలు కొంతమేర తగ్గాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ మార్కెట్లలో కూడా చికెన్ ధరలు దిగివచ్చాయి. విశాఖపట్నంలో కేజీ చికెన్ రూ.200కే లభిస్తుండగా, అనకాపల్లిలో రూ.210 వరకు విక్రయిస్తున్నట్టు సమాచారం. విజయవాడలో కేజీ చికెన్ ధర రూ.210 వద్ద కొనసాగుతుండగా, గుంటూరులో రూ.220 వరకు అమ్ముతున్నట్టు తెలిసింది. కార్తీకమాసం తర్వాత మరోసారి చికెన్ ధరలు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

తర్వాత చదవండి