వ్యాపారం

Smart phones & Gadgets : ఐఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. తక్కువ ధరకే 18ఈ లాంచ్!

స్మార్ట్ ఫోన్, గాడ్జెట్ లవర్స్ కోసం ప్రముఖ కంపెనీలు 2027లో ప్రారంభంలో కొత్త మోడల్స్ తీసుకురానున్నాయి. ఆపిల్, మోటరోలా, వివో సంస్థలు ఆ జాబితాలో ఉన్నాయి. తమ ప్రియమైన వినియోగదారుల కోసం కొత్త గాడ్జెట్స్‌ అప్డేట్స్‌ను ముందుగానే లీక్ చేశాయి. ఈసారి తక్కువ ధరకే బెస్ట్ ఫీచర్స్ తో బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్స్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు టెక్ వర్గాలు వెల్లడించాయి. ఇరాన్-అమెరికా యుద్ధం తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మరోవైపు ఏఐ విప్లవంతో చిప్స్ కొరత ఏర్పడింది. దీంతో ఇటీవల అన్ని ప్రముఖ బ్రాండ్లు మొబైల్, గాడ్జెట్ ధరలను భారీగా పెంచాయి. దీంతో సేల్స్ తగ్గుముఖం పట్టినట్టు సమాచారం. అందుకే ఈసారి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లను తీసుకొచ్చేందుకు కంపెనీలు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.