స్మార్ట్ ఫోన్, గాడ్జెట్ లవర్స్ కోసం ప్రముఖ కంపెనీలు 2027లో ప్రారంభంలో కొత్త మోడల్స్ తీసుకురానున్నాయి. ఆపిల్, మోటరోలా, వివో సంస్థలు ఆ జాబితాలో ఉన్నాయి. తమ ప్రియమైన వినియోగదారుల కోసం కొత్త గాడ్జెట్స్ అప్డేట్స్ను ముందుగానే లీక్ చేశాయి. ఈసారి తక్కువ ధరకే బెస్ట్ ఫీచర్స్ తో బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్స్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు టెక్ వర్గాలు వెల్లడించాయి. ఇరాన్-అమెరికా యుద్ధం తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మరోవైపు ఏఐ విప్లవంతో చిప్స్ కొరత ఏర్పడింది. దీంతో ఇటీవల అన్ని ప్రముఖ బ్రాండ్లు మొబైల్, గాడ్జెట్ ధరలను భారీగా పెంచాయి. దీంతో సేల్స్ తగ్గుముఖం పట్టినట్టు సమాచారం. అందుకే ఈసారి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లను తీసుకొచ్చేందుకు కంపెనీలు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
iPhone 18e, MacBook Neo :
2027 ప్రారంభంలో ఆపిల్ కంపెనీ (iPhone 18e, MacBook Neo)ను లాంచ్ చేయనున్నట్టు సమాచారం. ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో ఆపిల్ తన బడ్జెట్-ఫ్రెండ్లీ ఉత్పత్తులను విడుదల చేసే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేశాయి.కొత్తగా రాబోయే iPhone 18e ధర తక్కువ ఉంటుందని, కొత్త ఫీచర్లు ఉంటాయని సమాచారం. ఇందులో శక్తివంతమైన A20 చిప్, 6.1-అంగుళాల OLED డిస్ప్లే (60Hz రిఫ్రెష్ రేట్), వెనుకవైపు సింగిల్ కెమెరా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
అలాగే, విద్యార్థులు, సాధారణ వినియోగదారుల కోసం రూపొందించిన MacBook Neo (2nd Gen) ల్యాప్‌టాప్ అప్డేట్ వెర్షన్లో A19 Pro చిప్, 12GB RAM మార్కెట్లోకి విడుదల కానుంది. ఇవి రోజువారీ పనులను వేగంగా పూర్తి చేయడానికి ఉపయోగపడతాయని యాపిల్ వర్గాల సమాచారం.
Motorola Edge 70 Neo :
ఇక మోటరోలా తన కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ Motorola Edge 70 Neoను నవంబర్ 24న భారత్‌లో విడుదల చేయనున్నట్టు సమాచారం. దీనిలో 6.8-అంగుళాల 1.5K 144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, Snapdragon 7s Gen 3 ప్రాసెసర్, 50MP సోనీ ప్రధాన కెమెరా ఫీచర్లు ఉన్నాయి. దీని ప్రధాన ఆకర్షణ 7,000mAh భారీ బ్యాటరీ. 45W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. సుమారు రూ. 30వేల ధరల శ్రేణిలో ఫ్లిప్‌కార్ట్, మోటరోలా వెబ్సైట్లో లభించన్నట్టు సమాచారం.
Vivo S70 సిరీస్ :
వివో తన Vivo S70, S70 Pro స్మార్ట్ఫోన్లను వచ్చేనెలలో చైనాలో విడుదల చేయనున్నట్టు తెలిసింది. దీనిలో 6.59-అంగుళాల 120Hz OLED స్క్రీన్, Snapdragon 8s Gen 4 ప్రాసెసర్, 7,000mAh బ్యాటరీ, 90W ఛార్జింగ్ ఉంటుందని సమాచారం. 64MP టెలిఫోటో లెన్స్, ప్రత్యేకమైన 200mm టెలికన్వర్టర్ సపోర్టుతో రానుంది.వచ్చే ఏడాదిలో Vivo V90 సిరీస్ పేరుతో ఇండియాలో లాంచ్ కానున్నట్టు సమాచారం. దీని ధర కూడా సుమారు రూ.25 వేల నుంచి రూ.35వేల లోపు ఉంటుందని తెలుస్తోంది.
