తెలంగాణ
నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి తీపికబురు.. త్వరలో మరో 25 వేల సర్కారీ కొలువులు!
నిరుద్యోగ యువతకు సీఎం రేవంత్ రెడ్డి తీపికబురు అందించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి ఇప్పటివరకు 75 వేల ప్రభుత్వ ఉద్యోగాలను విజయవంతంగా భర్తీ చేశామని, అతి త్వరలోనే మరో 25వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభోత్సవ బహిరంగ సభలో సీఎం ఈ కీలక ప్రకటన చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఆయన వ్యాఖ్యలతో ప్రభుత్వ కొలువుల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థుల్లో కొత్త ఆశలు చిగురించాయి.
