తెలంగాణ

మత్స్యకారుల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

Jupally Krishna Rao: కొల్లాపూర్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవాల్లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత్స్యకారులకు వారు శుభాకాంక్షలు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు పేర్కొన్నారు. మత్స్యకారుల కష్టానికి తగిన ఆదాయం వచ్చేలా చేపల ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని అన్నారు.