తెలంగాణ
Farmer Death : సర్కార్ నిర్లక్ష్యం.. ధాన్యం కుప్ప మీదే రైతన్న మరణం
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం బూర్గుమల్ల గ్రామంలో నాళ్లం వీరస్వామి (60) అనే రైతు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో పోసి, సర్కారు కొనుగోలు చేస్తుందని 15 రోజులుగా పడిగాపులు కాస్తున్నాడు.రాత్రి వర్షం పడేలా ఉందని ఆరబోసిన ధాన్యాన్ని కుప్పగా పోస్తూ, ఛాతీలో నొప్పిగా ఉందని ధాన్యం కుప్పపైనే కుప్పకూలి కన్నుమూశాడు. ప్రభుత్వ నిర్లక్ష్యమే వీరస్వామి మరణానికి కారణమని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, బాధిత రైతన్న కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, రైతు బీమా అందించాలని తోటి రైతాంగం డిమాండ్ చేస్తోంది.
