తెలంగాణ

సిద్ధిపేటలో నాపై పోటీ చేసి గెలువు- సీఎం రేవంత్‌కు హరీశ్ రావు సవాల్

Harish Rao: సిద్ధిపేటలో గెలిచే కాంగ్రెస్ అభ్యర్థికి మంత్రి పదవి ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీమంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఎవరో రావడం ఎందుకు, గెలిస్తే మంత్రి పదవి ఇవ్వడం ఎందుకు? నువ్వే రా.. నేను బీఆర్ఎస్ నుంచి, నువ్వు కాంగ్రెస్ నుంచి సిద్ధిపేటలో పోటీ చేద్దాం.. ఇక చూసుకుందాం. నువ్వో, నేనో తేల్చుకుందాం రా.. అని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు హరీశ్ రావు. సిద్ధిపేటలో గెలుస్తా, కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని అన్నావుగా.. సీదాగా నువ్వు, నేనే చూసుకుందాం.. రా.. అని హరీశ్ రావు చెలరేగిపోయారు.