తెలంగాణ

TG: "మాటల్లో వజన్ లేదు.. చేతల్లో విజన్ లేదు" సీఎం వ్యాఖ్యలపై హరీశ్ రావు కౌంటర్!

TG: సిద్దిపేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్ రావు గట్టి కౌంటర్ ఇచ్చారు. సీఎం ప్రసంగం ఆద్యంతం ప్రజల సమస్యలు, అభివృద్ధి ప్రణాళికలు లేకుండా కేవలం వ్యక్తిగత దూషణలు, ప్రగల్భాలతోనే సాగిందని ఆయన మండిపడ్డారు. సీఎం వ్యాఖ్యల్లో ఎలాంటి బలం లేదని, ఆయన పాలనలో విజన్ కనిపించడం లేదని విమర్శించారు. కరువుతో అల్లాడుతున్న రైతులకు ఈ సభ ద్వారా ఎలాంటి భరోసా దక్కలేదని, సిద్దిపేటకు రావాల్సిన రూ.1,070 కోట్ల పెండింగ్ పనుల గురించి గానీ, ఇందిరమ్మ జీవిత బీమా పథకం ఊసు గానీ సీఎం ఎత్తలేదని హరీశ్ రావు నిలదీశారు.