తెలంగాణ
బాంబే బ్రోకర్‌కి సీఎం రేవంత్ 500 కోట్లు లంచం ఇచ్చారు
Harish Rao: రేవంత్ పాలన అంతా భూముల చుట్టే తిరుగుతోందని మాజీమంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఇప్పటికే రేవంత్ ప్రభుత్వం 26వేల ఎకరాలు అమ్మేసిందని ఆరోపించారు. భూములు అమ్మడమే రేవంత్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు. హిల్ట్ పాలసీ పేరుతో పరిశ్రమల భూములు అమ్మేశారని చెప్పారు. భూములపై 46వేల కోట్లు అప్పుగా తెచ్చారని తెలిపారు. గ్యారెంటీల అమలు సంగతేమో కానీ భూములను మాత్రం గ్యారెంటీగా అమ్ముతున్నారని రేవంత్ సర్కార్ పై ధ్వజమెత్తారు. భూములు అమ్మడానికే సీఎం అయ్యారా? అని రేవంత్ ను ప్రశ్నించారు హరీశ్ రావు. కూకట్ పల్లి ట్రక్ పార్కింగ్ భూమి అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి మాజీమంత్రి హరీశ్ రావు హాజరయ్యారు.
