Congress vs BRS : హరీశ్ రావు VS ఎంపీ చామల.. కేఆర్ఎంబీ మినట్స్‌పై మాటల యుద్ధం
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్,ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మాటల మాటల యుద్ధం కొనసాగుతోంది.ముఖ్యంగా సాగు నీటి ప్రాజెక్టులు, ఏపీ జలదోపిడీ అంశాలపైనే ఈ రెండు పార్టీల నడుమ విమర్శ,ప్రతివిమర్శలు నడుస్తున్నాయి. కృష్ణా జల్లాల్లో తెలంగాణకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుంటే..కాదు కాదు అధికార పార్టీనే అని గులాబీ నేతలు చెబుతున్నారు.తాజాగా నాగార్జున సాగర్‌లో టన్నెల్ నిర్మించి తాగునీటి గ్రిడ్ ప్రాజెక్టును ఏపీ సర్కార్ నిర్మిస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ పార్టీ మీద చేసిన ఆరోపణలు, విమర్శలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పల్నాడు వాటర్ గ్రిడ్‌కు సంబంధించిన జీవో 56.. 2022 ఫిబ్రవరి 16నే జారీ అయిందని,ఈ ప్రాజెక్టు ఇప్పుడే మొదలైనట్లు హరీష్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చామల వెల్లడించారు. అదేవిధంగా 2015లోనే కృష్ణా జలాల్లో 299 టీఎంసీల తాత్కాలిక పంపిణీకి గత బీఆర్ఎస్ సర్కార్ అంగీకరించిందని తెలిపారు.
