Congress : రాష్ట్రంలో 73.18 లక్షల మంది ఓటర్లు చనిపోయారా? : మంత్రి ఉత్తమ్
రాష్ట్రంలో ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR)పై నీటి పారుదల శాఖ, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఎస్ఐఆర్ పేరుతో తెలంగాణలో ఏకంగా 73.18 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని అర్హల ఓట్లను తొలగిస్తోందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కంటే నాన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఓట్లు ఎక్కువగా డిలీట్ అవుతున్నాయని ఆరోపించారు.మూడు కోట్ల మంది ఓటర్లున్న రాష్ట్రంలో దాదాపు నాలుగో వంతు మంది చనిపోయారనో, రాష్ట్రం విడిచి వెళ్లిపోయారనో, అదృశ్యమయ్యారనో చెప్పడం ఏమాత్రం నమ్మశక్యంగా లేదని స్పష్టం చేశారు. నిన్న హైదరాబాద్లో జరిగిన ‘ది హిందూ హడిల్’ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణ సమాజం అత్యంత చైతన్యవంతమైనదని, ఇంత భారీ సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగింపునకు గురికావడం అత్యంత దిగ్భ్రాంతికరమైన పరిణామమని పేర్కొన్నారు.
