Health

Health tip : ఫ్లాక్స్ సీడ్స్ తింటే జుట్టు పెరుగుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారు?

ఆధునిక జీవనశైలి విధానాల వల్ల చాలా మంది చిన్నతనంలోనే హెయిర్ లాస్ అవుతున్నారు. ఒత్తిడితో కూడిన జీవనం, నిద్రలేని రాత్రులు గడపడం, ఆహారపు అలవాట్లు, నీరు ఎక్కువగా తీసుకోకపోవడం, కలుషిత వాతావరణం కారణంగా త్వరగా జుట్టు తెల్లబడటంతో పాటు రాలే సమస్య చాలా మంది వేధిస్తోంది. దీంతో యువతీయువకులు తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. దీంతో జట్టు రాలే సమస్య నుంచి ఉపశమనం పొందడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయుర్వేద చిట్కాలు పాటించడంతో పాటు హెయిర్ స్పెషలిస్టులను సైతం కన్‌సల్ట్ అవుతున్నారు.అయితే, ఫ్లాక్స్ సీడ్స్ తినడం వలన జుట్టు రాలే సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? అని చాలా మంది యూట్యూబ్,గూగుల్ లో సెర్చ్ చేస్తున్నట్టు తెలిసింది. నిజంగానే ఫ్లాక్స్ సీడ్స్ తినడం వలన జుట్టు రాలే సమస్యల తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారు? ఇప్పడు తెలుసుకుందాం..