వైరల్ న్యూస్
చిన్నారి ప్రాణాలు కాపాడిన శునకం.. వీడియో వైరల్
Dog Saves Girl: శునకం విశ్వాసానికి మారుపేరు అని అనడంలో సందేహమే లేదు. ఎందుకంటే.. ఎంత సాయం చేసినా మనిషి విశ్వాసంగా ఉంటాడన్న నమ్మకం లేదు. కానీ, తనకు అన్నం పెట్టి ఆదరించిన వారి పట్ల అంతులేని విశ్వాసం చూపిస్తుంది కుక్క. ఈ మూగజీవికి విశ్వాసమే కాదు.. ధైర్యం, సమయస్ఫూర్తి కూడా ఎక్కువే. తన యజమానికి ఏదైనా ఆపద వస్తే ప్రాణాలను పణంగా పెట్టి మరీ రక్షిస్తాయని చెప్పడంలో ఎంతమాత్రమూ సందేహం లేదు. గతంలో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. తాజాగా మరోసారి అలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. నీటిలో మునిగిపోకుండా రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కాపాడిందో శునకం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
