వైరల్ న్యూస్

Dog Saves Girl: చిన్నారి ప్రాణాలు కాపాడిన శునకం.. వీడియో వైరల్

చిన్నారి ఆపదలో ఉందని గ్రహించిన శునకం ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్విమ్మింగ్ పూల్‌ వైపు పరుగు తీసింది. అందులోకి దూకింది. చిన్నారికి దగ్గరగా వెళ్లింది. వెంటనే పాప నీళ్లలో మునిగిపోకుండా కుక్కను పట్టుకుంది.

Dog Saves Girl: శునకం విశ్వాసానికి మారుపేరు అని అనడంలో సందేహమే లేదు. ఎందుకంటే.. ఎంత సాయం చేసినా మనిషి విశ్వాసంగా ఉంటాడన్న నమ్మకం లేదు. కానీ, తనకు అన్నం పెట్టి ఆదరించిన వారి పట్ల అంతులేని విశ్వాసం చూపిస్తుంది కుక్క. ఈ మూగజీవికి విశ్వాసమే కాదు.. ధైర్యం, సమయస్ఫూర్తి కూడా ఎక్కువే. తన యజమానికి ఏదైనా ఆపద వస్తే ప్రాణాలను పణంగా పెట్టి మరీ రక్షిస్తాయని చెప్పడంలో ఎంతమాత్రమూ సందేహం లేదు.

గతంలో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. తాజాగా మరోసారి అలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. నీటిలో మునిగిపోకుండా రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కాపాడిందో శునకం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఆపదలో ఉన్న చిన్నారిని కాపాడిన శునకం

బ్రెజిల్ లో ఈ ఘటన జరిగింది. చిన్నారిని స్విమ్మింగ్ పూల్ దగ్గర వదిలేసి ఇంట్లో వాళ్లు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. చిన్నారి ఆడుకుంటూ స్విమ్మింగ్‌ పూల్‌లోకి దిగింది. మెట్ల మీద నుంచి ముందుకు వెళ్లింది. అయితే లోతు ఎక్కువగా ఉండడంతో ఆ చిన్నారి నీళ్లలో మునిగిపోయి ఊపిరి ఆడక గిలగిల కొట్టుకుంటుంది. అక్కడే ఉన్న పెంపుడు కుక్క దీన్ని పసిగట్టింది. చిన్నారి ఆపదలో ఉందని గ్రహించిన శునకం ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్విమ్మింగ్ పూల్‌ వైపు పరుగు తీసింది. అందులోకి దూకింది. చిన్నారికి దగ్గరగా వెళ్లింది. వెంటనే పాప నీళ్లలో మునిగిపోకుండా కుక్కను పట్టుకుంది.

రియల్ హీరో అంటూ కుక్కపై ప్రశంసల వర్షం

ఇంతలో ఇంట్లో వాళ్లు ఇది గమనించి అక్కడికి చేరుకున్నారు. ఓ మహిళ స్విమ్మింగ్ పూల్ లోకి దూకి చిన్నారిని ఎత్తుకుంటుంది. దీంతో పాప సురక్షితంగా బయటపడింది. ఆపదలో ఉన్న చిన్నారిని పెంపుడు శునకం కాపాడిన వైనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రియల్ హీరో అంటూ ఆ కుక్కపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆ మూగజీవి చూపిన విశ్వాసానికి, ధైర్యానికి నెటిజన్లు సలామ్ కొడుతున్నారు. ఇందుకే కదా.. కుక్క విశ్వాసానికి ప్రతీక అనేది అని అంటున్నారు.

తర్వాత చదవండి