సినిమా
Hero Nikhil: నషాముక్త్ భారత్ పాదయాత్రలో టాలీవుడ్ హీరో
Hero Nikhil: దేశ వ్యాప్తంగా డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఇప్పుడున్న యువతలో అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లో ‘నషాముక్త్ భారత్’ పాదయాత్రను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాదయాత్రలో టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ పాల్గొన్నారు. ఇక.. ఈ సందర్భంగా, ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా, సినిమాల్లో డ్రగ్స్, సిగరెట్, మద్యం లాంటి వాటిని హీరోయిజంగా చూపించే విషయంలో నిఖిల్ తన అభిప్రాయాన్ని బలంగా వెల్లడించారు.
