తెలంగాణ

హన్మకొండలో హైటెన్షన్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల ఘర్షణ

Brs Vs Congress: హన్మకొండలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు ఘర్షణకు దిగాయి. హన్మకొండ అభివృద్ధిపై ఇరువర్గాలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నాయి. హన్మకొండ చౌరస్తా వేదికగా చర్చకు సై అంటూ అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ శ్రేణులు కదంతొక్కాయి. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో, కాంగ్రెస్ మూడేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపై చర్చిద్దాం.. దమ్ముంటే రండి.. అంటూ ఇరు పార్టీల నాయకులు పోటాపోటీగా హన్మకొండ చౌరస్తాకు బయలుదేరడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.