Health

CANCER Health Tip : క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించడం ఎలా? ఏం చేయాలంటే?

క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు దేశవ్యాప్తంగా పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు ధూమమానం, మద్యపానం చేసే వారు క్యాన్సర్ బారిన పడితే ప్రస్తుతం వాటికి దూరంగా ఉంటున్న వారు సైతం ఈ ప్రాణాంతక వ్యాధికి గురవుతున్నారు. క్యాన్సర్ బారిన పడిన వారిలో ఎక్కువగా యువత, మిడిల్ ఏజ్ గ్రూపు వారే ఉన్నట్టు తెలుస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR - NCDIR) విడుదల చేసిన 'తెలంగాణ క్యాన్సర్ బర్డెన్ ప్రొఫైల్ -2026', క్యాన్సర్ అట్లాస్ నివేదికల ప్రకారం.. రాష్ట్రంలో 19 ఏళ్లు పైబడిన యువతలో ఏడాదికి 46,762 కొత్త క్యాన్సర్ కేసులు నమోదైనట్టు అంచనా వేశారు. ఇక గతేడాది మొత్తం 53,565 కేసులు నమోదైనట్టు సమాచారం. 2026లో నమోదైన కొత్త కేసుల్లో మహిళల సంఖ్య 25,510 ఉండగా, పురుషుల సంఖ్య 21,252గా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి లక్ష మంది జనాభాకు సగటున ఏడాదికి 52 క్యాన్సర్ కేసులు నమోదవుతున్నట్టు నివేదికలు వెల్లడించాయి.