తెలంగాణ
Hyd: ఆకాశంలో అద్భుతం.. కెమెరాకు చిక్కిన లియోనిడ్ ఉల్కాపాతం!
హైదరాబాద్లో అద్భుత దృశ్యం కనువిందు చేసింది. ఆకాశంలో ఆవిష్కృతమైన అత్యంత అరుదైన లియోనిడ్ (Leonid) ఉల్కాపాతం దృశ్యాలను నగరంలోని ఔత్సాహిక ఖగోళ పరిశోధకులు తమ కెమెరాలలో విజయవంతంగా బంధించారు. నవంబర్ 17, 18 తేదీల్లో ఈ ఉల్కాపాతం తారస్థాయికి చేరుకున్న సమయంలో ఏకంగా 87ఉల్కల కదలికలను స్పష్టంగా రికార్డ్ చేసినట్లు వారు తాజాగా ప్రకటించారు. నగరంలోని షేక్పేట్ ప్రాంతంలో ఉన్న 'స్టార్ గేజర్స్ టెర్రస్ అబ్జర్వేషన్ స్టేషన్' కేంద్రంగా ఈ అద్భుతమైన ఖగోళ వింతను అత్యంత స్పష్టతతో చిత్రీకరించారు.
