క్రైమ్

అండాల అక్రమ దందా కేసు.. ఇద్దరు కీలక అధికారులు అరెస్ట్

Human Egg: హైదరాబాద్‌లో సంచలనం రేపిన అక్రమ అండాల సేకరణ కేసులో మల్కాజిగిరి పోలీసులు (Malkajgiri Police) దర్యాప్తును వేగవంతం చేశారు. ఒయాసిస్ ఫెర్టిలిటీ కేంద్రాల (Oasis Fertility Center) పేరుతో జరుగుతున్న అక్రమ అండాల సేకరణ (Illegal Human Egg Collection) వ్యవహారంలో సద్గురు హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.

కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రతిక్ (COO) అనిల్ గగ్లానీ, మెడికల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ రాజర్షి దేబ్‌లను అదుపులోకి తీసుకున్నారు. సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నంబర్ 1145/2026 కేసు దర్యాప్తులో భాగంగా ఈ అరెస్టులు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే ఈ కేసులో దుర్గా ప్రసాద్, అమిత్, నికత్ పర్వీన్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.