Hyderabad Metro: రాజకీయ రచ్చలో హైదరాబాద్ మెట్రో.. ఆ ఇద్దరు నేతలు కలిసి అడ్డుకున్నారా?
Hyderabad Metro: లక్షలాది మంది హైదరాబాదీలకు నిత్యం ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న మెట్రో రైలు, ఇప్పుడు తెలంగాణలో మూడు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య రణరంగానికి కేంద్రబిందువుగా మారింది. ఎల్ అండ్ టీ చేతిలో ఉన్న మెట్రో ఫేజ్-1ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ కాస్తా, ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ముఖ్యంగా మెట్రో టేకోవర్ కోసం రావాల్సిన రూ. 13,600 కోట్ల రుణం ఆగిపోవడం వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు పెను దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇద్దరూ కలిసి ఈ రుణాన్ని అడ్డుకున్నారా? అనే చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.హైదరాబాద్ మెట్రో ఫేజ్-1ను సొంతం చేసుకోవాలని నిర్ణయించుకున్న తెలంగాణ ప్రభుత్వం, ఇందుకోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ. 13,600 కోట్ల రుణం తీసుకోవాలని ప్లాన్ చేసింది. మే నెలలోనే దీనికి సంబంధించిన రుణ ఒప్పందం కుదిరిందని, అవసరమైన పత్రాలన్నీ సమర్పించామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.
