రాజకీయాలు

MLA Sudarshan Reddy : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సంచలనం!

అధికార కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. పదవులు,పార్టీలో ప్రాధాన్యత కోసం కొందరు నేతలు అధిష్టానం ఎంత చెప్పినా వినకుండా ఎదురుతిరుగుతున్నారు.పార్టీకి వ్యతిరకంగా మాట్లాడొద్దని, ఏదైనా సమస్య ఉంటే తమ వద్దకు తీసుకురావాలని క్రమశిక్షణా కమిటీ పెద్దలు చెబితే ‘మేం చాలా సీనియర్లం, మమ్మల్నే క్వశ్చన్ చేస్తారా?’ అని రివర్స్ కౌంటర్ ఇస్తున్నట్టు తెలిసింది. దీంతో ఏం చేయాలో తెలియక టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ పెద్దలు తలలు పట్టుకున్నారు. అయితే, కొందరు సీనియర్లు పార్టీకి అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు దక్కకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలో గత మూడేండ్లుగా తనకు మంత్రి వస్తుందని ఎదురుచూసిన బోధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి తాజాగా సంచలన ప్రకటన చేశారు.వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటూ ప్రకటించారు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నియోజకవర్గంలో 'చేయూత' పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.