తెలంగాణ

మహిళల పేదరికమే వారి పెట్టుబడి.. అండాలకూ రేటు కట్టేశారు.. ఎంత దారుణం?

ఓ వైపు పేదరికం. మరోవైపు అనారోగ్యంతో బాధ పడుతున్న తల్లిదండ్రులను కాపాడుకోవాలనే ఆశ. ఇంటి నిండా కష్టాలు. అలాంటి మహిళలకు మరో దారి కనిపించలేదు. ఎలాగైనా తమ కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఈ రెండే వారి ముందు కనిపించాయి. సరిగ్గా వారి కష్టాలే బ్రోకర్లకు అవకాశంగా మారాయి. హైదరాబాద్ లో వెలుగు చూసిన అక్రమ అండాల వ్యాపారం వెనుక కథ ఇదే.