National

INDIA Bloc Meeting: కీలక బిల్లుకు మెజారిటీ దిశగా ఎన్డీఏ కసరత్తు.. ఆ రెండు పార్టీల వైఖరిపైనే అందరి చూపు!

  నియోజకవర్గాల పునర్విభజన (Delimitation Bill 2026), మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన 132వ రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల ప్రత్యేక మెజారిటీ సాధించే దిశగా ఎన్డీఏ అడుగులు వేస్తోంది. ఈ పరిణామాల్లో లోక్‌సభలో 22 మంది ఎంపీలు ఉన్న డీఎంకే, 8 మంది ఎంపీలు ఉన్న శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) వైఖరి అత్యంత కీలకంగా మారింది. నేడు చెన్నైలో జరగనున్న డీఎంకే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బిల్లులకు మద్దతు ఇచ్చే దిశగా కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. లోక్‌సభలో తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న 7.18 శాతం ప్రాతినిధ్యం తగ్గకూడదని, అలాగే రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తిని ఎలాంటి మార్పులు లేకుండా మరో 25 ఏళ్ల పాటు (2051 వరకు) కొనసాగించాలని డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ డిమాండ్ చేశారు.