తెలంగాణ

Flight Cancellations: విమాన ప్రయాణికులకు షాక్.. పీక్ సీజన్‌లో 7,154 సర్వీసులకు కోత! అసలు కారణమేంటో తెలుసా?

Flight Cancellations: ఇయర్ ఎండింగ్ సెలవులు, పెళ్లిళ్ల ముహూర్తాలు, పండగలతో సాధారణంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో విమాన ప్రయాణాలకు విపరీతమైన గిరాకీ ఉంటుంది. ఎయిర్‌పోర్టులన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతూ, టికెట్ల ధరలు ఆకాశాన్నంటుతుంటాయి. కానీ ఈసారి మాత్రం సీన్ పూర్తిగా తలకిందులైంది. 2022 తర్వాత మొదటిసారిగా ఈ రద్దీ సీజన్‌లో దేశీయ విమాన సర్వీసుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఏవియేషన్ అనలిటిక్స్ సంస్థ ‘సిరియం’ విడుదల చేసిన తాజా గణాంకాలు ప్రయాణికులతో పాటు విమానయాన వర్గాలనూ ఆశ్చర్యపరుస్తున్నాయి.గత ఏడాదితో పోలిస్తే ఈ నవంబర్, డిసెంబర్ నెలల్లో దేశీయ విమానయాన సంస్థలు మొత్తం 7,154 సర్వీసులను కుదించాయి. అంటే సగటున రోజుకు 117 విమానాలు రద్దవుతున్నాయన్నమాట. ఈ రెండు నెలల్లో కలిపి మొత్తం 95,774 సర్వీసులు మాత్రమే నడవనున్నాయి,