National

Chariot-1 Ai models : స్వదేశీ ఏఐ మోడల్స్.. ‘టెక్ట్స్ టు స్పీచ్’ ఫీచర్‌కు యూజర్ల ఫిదా!

కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో దేశీయ కంపెనీలు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం భారత యువత, ఉద్యోగులు విదేశీ సంస్థలు తయారు చేసిన ఏఐ టూల్స్, మోడల్స్‌ను వాడుతున్నాయి.మున్ముందు ఇతర దేశాల మీద ఆధారపడకూడదని ప్రధాని మోడీ పిలుపు మేరకు స్వదేశీ సాంకేతిక త సాయంతోనే ఇక్కడి కంపెనీలు ఏఐ మోడల్స్,టూల్స్ తయారీ మీద ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే స్వదేశీ 'చారియట్-1' (Chariot-1) ఏఐ మోడల్ అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియా ఏఐ (India AI) మిషన్ కింద 'చారియట్-1' ఫౌండేషన్ మోడల్స్ విడుదలయ్యాయి. దీనిని దేశంలోనే పూర్తిగా అభివృద్ధి చేసినట్టు తెలిసింది.