Indiramma Bheema : ఇంటి పన్ను కడితేనే ఇందిరమ్మ బీమా.. అధికారులకు ఓవరాక్షన్!
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ బీమాపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రకటించి రెండు వారాలు గడువకముందే ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేలా కొందరు అధికారులు వ్యవహరించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కుటుంబ పెద్ద మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.5 లక్షల భరోసా కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 21న ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా కొత్త స్కీమ్‌ను ప్రారంభించారు. గతంలో కేవలం రైతులకు మాత్రమే వర్తించే బీమాను తెలంగాణ ప్రజానీకానికి వర్తింపజేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.రేషన్ కార్డు కలిగిన వారు ఈ పథకానికి అర్హులు.. 19 ఏళ్ల పైబడి 59 ఏళ్లలోపు వయసు వారికి ఈ బీమా వర్తించనుంది. ఈ స్కీం ప్రకటించిన మరుసటి రోజు నుంచే దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులు తమ పేర్లు నమోదు చేసుకుంటున్నారు. అయితే, ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా ములుగు జిల్లాలో అధికారులు వ్యవహరిస్తున్నట్టు సమాచారం.
