తెలంగాణ

Indiramma Bheema : ఇంటి పన్ను కడితేనే ఇందిరమ్మ బీమా.. అధికారులకు ఓవరాక్షన్!

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ బీమాపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రకటించి రెండు వారాలు గడువకముందే ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేలా కొందరు అధికారులు వ్యవహరించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ బీమాపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రకటించి రెండు వారాలు గడువకముందే ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేలా కొందరు అధికారులు వ్యవహరించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కుటుంబ పెద్ద మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.5 లక్షల భరోసా కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 21న ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా కొత్త స్కీమ్‌ను ప్రారంభించారు. గతంలో కేవలం రైతులకు మాత్రమే వర్తించే బీమాను తెలంగాణ ప్రజానీకానికి వర్తింపజేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రేషన్ కార్డు కలిగిన వారు ఈ పథకానికి అర్హులు.. 19 ఏళ్ల పైబడి 59 ఏళ్లలోపు వయసు వారికి ఈ బీమా వర్తించనుంది. ఈ స్కీం ప్రకటించిన మరుసటి రోజు నుంచే దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులు తమ పేర్లు నమోదు చేసుకుంటున్నారు. అయితే, ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా ములుగు జిల్లాలో అధికారులు వ్యవహరిస్తున్నట్టు సమాచారం.

ఇంటిపన్ను కడితేనే బీమా..

ఇంటి పన్ను కడితేనే ఇందిరమ్మ బీమా వస్తుందని, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ నమోదు తీసుకుంటామని చెబుతున్నట్టు తెలిసింది. పన్ను కట్టకపోతే బీమా దరఖాస్తు నమోదు చేయబోమని అధికారులు స్పష్టంచేసినట్టు సమాచారం. ములుగు జిల్లా వాజేడు మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో ఇదే పరిస్థితి నెలకొన్నట్టు తెలుస్తోంది.ఇంటి పన్ను వసూళ్లలో మండలం వెనుకబడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంపీవో వెల్లడించారు.పైఅధికారుల ఆదేశాల మేరకే పన్నులు వసూలు చేస్తున్నామని పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు. పన్ను చెల్లించని కుటుంబాలు దరఖాస్తుకు ముందుకు రాకపోవడంతో నమోదు కేంద్రాలు వెలవెలబోతున్నాయి.

ఉన్నతాధికారుల వివరణ..

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదుకు ఇంటి పన్ను రసీదు లేదా ఇంటి పన్ను చెల్లింపు తప్పనిసరి కాదని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. బీమా దరఖాస్తుల నమోదుకు ఇంటి పన్నుతో ఎలాంటి సంబంధం లేదని పలు మండలాల ఎంపీడీవోలు, ఉన్నతాధికారులు తెలిపారు.కొన్ని గ్రామాల్లో కార్యదర్శులు, స్థానిక సిబ్బంది ఇంటి పన్ను కడితేనే ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తున్నట్లు ఆరోపణలు రాగా, లబ్ధిదారులు, స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.బీమా నమోదు కోసం ఆధార్, రేషన్ కార్డు, ఫోన్ నంబర్, నామినీ వివరాలు సరిపోతాయని అధికారులు స్పష్టంచేస్తున్నారు.

తర్వాత చదవండి