తెలంగాణ

Indiramma Sarees : కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు.. పంపిణీ ఎప్పుడంటే?

రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఇందిరమ్మ చీరలు ఈ పంపిణీ చేయనున్నారు. నవంబర్ 26న నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం రెండోసారి ఇందిరమ్మ చీరలను అందిస్తోంది. ఈసారి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు కలిపి కోటి చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల మంది మహిళలకు, పట్టణ ప్రాంతాల్లో 35 లక్షల మందికి చీరలు అందించనున్నారు. మహిళల అభిరుచికి అనుగుణంగా ఆకర్షణీయమైన చిలకపచ్చ రంగులో ప్రత్యేకంగా చీరలను ప్రభుత్వం తయారు చేయించింది. రెండు రకాల డిజైన్లలో వీటిని సిద్ధం చేశారు.