తెలంగాణ
రేవంత్ లాంటి కాంగ్రెస్ నాయకుల వల్లే తెలంగాణకు అన్యాయం
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి లాంటి చేతకాని కాంగ్రెస్ నాయకుల వల్లే ఇవాళ కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఆనాడు శ్రీశైలం నుంచి నీళ్లు పోవడానికైనా, నేడు సాగర్ నుంచి నీళ్లు పోవడానికైనా, ఏపీకి గోదావరి జలాల అక్రమ తరలింపునకైనా.. రేవంత్ రెడ్డి లాంటి కాంగ్రెస్ నేతల మోసపూరిత విధానాలే కారణం అన్నారు. వారి వైఖరి వల్లే ఇవాళ తెలంగాణకు నష్టం జరుగుతోందన్నారు.
రేవంత్ రెడ్డి ఒక కోవర్ట్, సబ్వర్ట్, పర్వర్ట్
''రేవంత్ రెడ్డి ఒక కోవర్ట్, సబ్వర్ట్, పర్వర్ట్. చంద్రబాబు జలదోపిడీకి సహకరించే కోవర్ట్. వ్యవస్థను భ్రష్టు పట్టించిన సబ్వర్ట్. వికృత మనస్తత్వం కలిగిన పర్వర్ట్. నిన్న సభలో కేవలం గంట ప్రసంగంలోనే కేసీఆర్, కేటీఆర్, నా పేరు 140 సార్లు ఉచ్చరించాడు'' అని హరీశ్ రావు విరుచుకుపడ్డారు.
