తెలంగాణ

Harish Rao: రేవంత్ లాంటి కాంగ్రెస్ నాయకుల వల్లే తెలంగాణకు అన్యాయం- హరీశ్ రావు

Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి లాంటి చేతకాని కాంగ్రెస్ నాయకుల వల్లే ఇవాళ కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఆనాడు శ్రీశైలం నుంచి నీళ్లు పోవడానికైనా, నేడు సాగర్ నుంచి నీళ్లు పోవడానికైనా, ఏపీకి గోదావరి జలాల అక్రమ తరలింపునకైనా.. రేవంత్ రెడ్డి లాంటి కాంగ్రెస్ నేతల మోసపూరిత విధానాలే కారణం అన్నారు. వారి వైఖరి వల్లే ఇవాళ తెలంగాణకు నష్టం జరుగుతోందన్నారు.

Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి లాంటి చేతకాని కాంగ్రెస్ నాయకుల వల్లే ఇవాళ కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఆనాడు శ్రీశైలం నుంచి నీళ్లు పోవడానికైనా, నేడు సాగర్ నుంచి నీళ్లు పోవడానికైనా, ఏపీకి గోదావరి జలాల అక్రమ తరలింపునకైనా.. రేవంత్ రెడ్డి లాంటి కాంగ్రెస్ నేతల మోసపూరిత విధానాలే కారణం అన్నారు. వారి వైఖరి వల్లే ఇవాళ తెలంగాణకు నష్టం జరుగుతోందన్నారు.

రేవంత్ రెడ్డి ఒక కోవర్ట్, సబ్‌వర్ట్, పర్వర్ట్

''రేవంత్ రెడ్డి ఒక కోవర్ట్, సబ్‌వర్ట్, పర్వర్ట్. చంద్రబాబు జలదోపిడీకి సహకరించే కోవర్ట్. వ్యవస్థను భ్రష్టు పట్టించిన సబ్‌వర్ట్. వికృత మనస్తత్వం కలిగిన పర్వర్ట్. నిన్న సభలో కేవలం గంట ప్రసంగంలోనే కేసీఆర్, కేటీఆర్, నా పేరు 140 సార్లు ఉచ్చరించాడు'' అని హరీశ్ రావు విరుచుకుపడ్డారు.

కమలహాసన్‌ను మించిన నటుడు రేవంత్ రెడ్డి

అబద్ధాలు చెప్పడంలో రేవంత్ రెడ్డికి (Cm Revanth Reddy) ఆస్కార్ ఇవ్వొచ్చని విమర్శించారు. స్వాతి ముత్యం సినిమాలో కమలహాసన్ ను మించిన నటుడు ఈ రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. పోతిరెడ్డిపాడు (Pothireddypadu) బొక్క పెద్దది చేసింది మేమే అని సీఎం రేవంత్ అనడం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిగా ఉన్నాను, అబద్ధాలు చెబితే ప్రజలు నమ్ముతారని అనుకోవడం రేవంత్ రెడ్డి భ్రమ అవుతుందన్నారు. ఏపీ జల దోపిడీకి పాల్పడుతున్నా.. రేవంత్ సర్కార్ కు పట్టింపు లేదని దుయ్యబట్టారు. చేసిందంతా చేసి నేడు మాపై నిందలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీశ్ రావు.

చంద్రబాబు జలదోపిడీకి సహకరిస్తున్న వ్యక్తి రేవంత్

చంద్రబాబు (Chandrababu) జలదోపిడీకి సహకరిస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. కృష్ణా, గోదావరి, సాగర్ జలాలు ఏపీకి తరలివెళ్లడానికి కారణం రేవంతే అని చెప్పారు. సిద్ధిపేట (Siddipet) సభలో రేవంత్ రెడ్డి మాట్లాడినవన్నీ అబద్ధాలే అని హరీశ్ రావు పేర్కొన్నారు. సీఎం రేవంత్ లో ఫ్రస్టేషన్ కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బూతులు తప్ప పాలన లేదని సొంత ఎమ్మెల్యేలే చెబుతున్నారని హరీశ్ రావు (Harish Rao) గుర్తు చేశారు.

మేము రాజీనామా చేసిన 3నెలలకు పోతిరెడ్డిపాడు జీవో వచ్చింది

కరువు నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి సీఎం రేవంత్ బూతులను నమ్ముకున్నారని మండిపడ్డారు. అర్థరాత్రి 12 గంటలకు కేసీఆర్ ఆదేశం ఇస్తే.. రాజీనామా లేఖను అమెరికా నుంచి ఫ్యాక్స్ లో పంపిన ఒక ఉద్యమకారుడు, తెలంగాణ బిడ్డ నాయిని నర్సింహారెడ్డి.. అలాంటి వ్యక్తిపైనా సీఎం రేవంత్ అడాలు వేస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. మేము రాజీనామా చేసిన మూడు నెలలకు పోతిరెడ్డిపాడు జీవో వచ్చిందని హరీశ్ తెలిపారు.

పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర మీది

''కాంగ్రెస్ తెలంగాణకు అన్యాయం చేస్తోందని ఆనాడు మంత్రి పదవులకు రాజీనామాలు చేసిన చరిత్ర మాది. పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర మీది. మేం రాజీనామా చేసిన తర్వాత పోతిరెడ్డిపాడు జీవో వస్తే, 40 రోజులు అసెంబ్లీని స్తంభింపజేశాం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయిని నర్సింహా రెడ్డి గురించి మాట్లాడే హక్కు రేవంత్ కు లేదు'' అని హరీశ్ రావు ధ్వజమెత్తారు.

పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా పోరాడింది ఒకే ఒక్క కాంగ్రెస్ నాయకుడు పీజేఆర్

''పోతిరెడ్డి పాడు కాంగ్రెస్ పాలనలో మొదలైంది. పోతిరెడ్డిపాడు జీవో వస్తే దానికి వ్యతిరేకంగా పదవులకు రాజీనామా చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 40 రోజులు అసెంబ్లీని స్థంభింపజేశాం. ఆరోజు మాతో గొంతు కలిపింది ఒకే ఒక్క తెలంగాణ బిడ్డ పీజేఆర్ (PJR). ఈ రేవంత్, ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆంధ్రోళ్ల సంకలు నాకుతూ కూర్చున్నారు. పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా పోరాడింది టీఆర్ఎస్ పార్టీ, ఒకే ఒక్క కాంగ్రెస్ నాయకుడు పీజేఆర్. ఆంధ్రోళ్ల అడుగులకు మడుగులు ఒత్తుకున్న మీరా మాట్లాడేది? చేసిందంతా మీరు చేసి.. నిందలు మాపై మోపుతారా? చెంపలు వేసుకుని ముక్కు నేలకు రాసి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి'' అని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

తర్వాత చదవండి