తెలంగాణ
తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగుబాటు సెగలు.. రేవంత్‌కు సొంత పార్టీ నేతల నుంచే షాక్!
తెలంగాణ కాంగ్రెస్ లో ఇంటిపోరు మొదలైందా..? పరిస్థితి చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్‌తో రాజకీయ యుద్ధానికి సీఎం రేవంత్ సిద్ధమవుతుంటే.. సొంత పార్టీ నేతలే ఆయనకు షాకుల మీద షాకులిస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ముఖ్యమంత్రినే నేరుగా టార్గెట్ చేస్తూ విమర్శల దాడి పెంచుతున్నారు. ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారశైలి ఇప్పుడు కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది.తెలంగాణ కాంగ్రెస్ లో ఇంటిపోరు మొదలైందా..? పరిస్థితి చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. బీఆర్ఎస్‌తో రాజకీయ యుద్ధానికి సీఎం రేవంత్ సిద్ధమవుతుంటే.. సొంత పార్టీ నేతలే ఆయనకు షాకుల మీద షాకులిస్తున్నారు. ఓ వైపు రాజగోపాల్ రెడ్డి, మరోవైపు అనిరుధ్ రెడ్డి ధిక్కార స్వరాలు వినిపిస్తున్నారు.
