Health
Health Tip : ‘గట్’ హెల్త్ పదే పదే దెబ్బతింటుందా? ఈ తప్పులు చేస్తున్నారా చెక్ చేసుకోండి?
చాలా మంది ఆరోగ్యం విషయంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించరు. తీరా అనారోగ్య సమస్యలు ఎదురయ్యాక బాధపడుతుంటారు. హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటారు. అపరిశుభ్రమైన ఫుడ్ తీసుకోవడం, సరైన ఫైబర్ లెవల్ ఆహారం తీసుకోకపోవడం వలన ఇటీవలి కాలంలో చాలా మంది ‘గట్’ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే రోజువారీ ఆహారంలో సమతుల్య పోషకాహారంతో పాటు గట్ హెల్త్ బాగుండే ఫుడ్ కూడా తీసుకోవడం చాలా ముఖ్యం. ఫైబర్‌తో పాటు విటమిన్లు, ప్రొటీన్లు కూడా చాలా కీలకం. కొందరు తమ బిజీ లైఫ్‌లో ఇంట్లో వండుకునే సమయం లేకపోవడంతో బయట ఫుడ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందులోనూ ఆరోగ్యకరమైన ఫుడ్ జోలికి వారు వెళ్లడం లేదని తెలిసింది.
