ఆరోగ్యం

Health Tip : ‘గట్’ హెల్త్ పదే పదే దెబ్బతింటుందా? ఈ తప్పులు చేస్తున్నారా చెక్ చేసుకోండి?

చాలా మంది ఆరోగ్యం విషయంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించరు. తీరా అనారోగ్య సమస్యలు ఎదురయ్యాక బాధపడుతుంటారు. హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటారు. అపరిశుభ్రమైన ఫుడ్ తీసుకోవడం, సరైన ఫైబర్ లెవల్ ఆహారం తీసుకోకపోవడం వలన ఇటీవలి కాలంలో చాలా మంది ‘గట్’ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.

చాలా మంది ఆరోగ్యం విషయంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించరు. తీరా అనారోగ్య సమస్యలు ఎదురయ్యాక బాధపడుతుంటారు. హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటారు. అపరిశుభ్రమైన ఫుడ్ తీసుకోవడం, సరైన ఫైబర్ లెవల్ ఆహారం తీసుకోకపోవడం వలన ఇటీవలి కాలంలో చాలా మంది ‘గట్’ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.

ఆరోగ్యంగా ఉండాలంటే రోజువారీ ఆహారంలో సమతుల్య పోషకాహారంతో పాటు గట్ హెల్త్ బాగుండే ఫుడ్ కూడా తీసుకోవడం చాలా ముఖ్యం. ఫైబర్‌తో పాటు విటమిన్లు, ప్రొటీన్లు కూడా చాలా కీలకం. కొందరు తమ బిజీ లైఫ్‌లో ఇంట్లో వండుకునే సమయం లేకపోవడంతో బయట ఫుడ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందులోనూ ఆరోగ్యకరమైన ఫుడ్ జోలికి వారు వెళ్లడం లేదని తెలిసింది. చీజ్ బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా, చిప్స్, చాక్లెట్లు, క్యాండీలు వంటి జంక్ ఫుడ్స్‌ తీసుకుంటున్నట్టు తెలిసింది. ఫైబర్ ఫుడ్ తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటున్నారు. జంక్ పుడ్‌లో కొవ్వు, చక్కెర, ఉప్పు మాత్రం ఎక్కువగా ఉంటాయి. వీటిని తరచూ తినడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మెదడు పనితీరుపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

గట్ హెల్త్ దెబ్బతింటే అన్ని సమస్యలే..

జీర్ణాశయంలోని మంచి బ్యాక్టీరియా దెబ్బతిన్నప్పుడు కేవలం కడుపుకు సంబంధించిన సమస్యలే కాకుండా, శరీరంలోని ఇతర భాగాలపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ముందుగా జీర్ణవ్యవస్థ సమస్యలు (గ్యాస్, కడుపు ఉబ్బరం, తేన్పులు) వస్తాయి. మలబద్ధకం లేదా తరచుగా విరేచనాలు, ఛాతీలో మంట, అజీర్తి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) వంటి దీర్ఘకాలిక పేగు సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో సుమారు 70% గట్‌లోనే ఉంటుంది. గట్ దెబ్బతింటే తరచుగా జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్లు వెంటాడుతాయి. గట్, మెదడుకు మధ్య నేరుగా సంబంధం ఉంటుంది. శరీరానికి ఆనందాన్ని ఇచ్చే 'సెరోటోనిన్' అనే హార్మోన్ ఎక్కువగా గట్‌లోనే ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల గట్ హెల్త్ దెబ్బతింటే ఆందోళన (Anxiety), ఒత్తిడి (Stress), డిప్రెషన్, 'బ్రెయిన్ ఫాగ్' (ఏకాగ్రత లోపించడం), తలనొప్పి, గ్యాస్టిక్ వంటి సమస్యలు కూడా వెంటాడుతాయి.

గట్ హెల్త్ బాగుండాలంటే..

గట్ హెల్త్ బాగుండాలంటే ప్రోబయోటిక్స్ అవసరం.. మంచి బ్యాక్టీరియాను నేరుగా శరీరానికి అందించే పులియబెట్టిన (Fermented) ఆహారాలను రోజూ తీసుకోవాలి.పెరుగు, మజ్జిగ, ఇడ్లీ, దోశ, గంజిని ఆహారంలో భాగం చేసుకోవాలి.మంచి బ్యాక్టీరియా పెరగడానికి ఆహారంగా ఉపయోగపడే పీచు పదార్థాలను (Fiber) ఎక్కువగా తినాలి.అరటిపండు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఓట్స్, ఆపిల్, పప్పుధాన్యాలు, ఆకుకూరల్లో ఫైబర్ బాగుంటుంది. అధిక చక్కెర, మైదా, జంక్ ఫుడ్, కృత్రిమ స్వీటెనర్లు గట్‌లోని చెడు బ్యాక్టీరియాను పెంచి, మంచి బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. అందుకే వాటికి దూరంగా ఉండాలి. తగినంత నీరు, 8 గంటల నిద్ర, యోగా, ధాన్యం వంటివి చేయడం కూడా గట్ హెల్త్ ను పెంచుతాయి.

తర్వాత చదవండి