తెలంగాణ
TG: రాయదుర్గంలో ‘గోల్డ్ మ్యాన్’ గుట్టు రట్టు చేసిన ఐటీ శాఖ!
TG: ఒంటినిండా కిలోల కొద్దీ బంగారం వేసుకుని సోషల్ మీడియాలో హల్చల్ చేసిన తెలంగాణ ‘గోల్డ్ మ్యాన్’ యాదగిరి చిన్న గౌడ్ అలియాస్ దర్గా చిన్న పహిల్వాన్ ఆర్థిక వ్యవహారాలపై ఐటీ అధికారులు నిఘా పెట్టారు. అతనికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని ఆరా తీసిన ఐటీ శాఖ, తాజాగా హైదరాబాద్‌లోని రాయదుర్గంలో ఉన్న ఒక పెద్ద బిల్డింగ్‌ను, దాని ద్వారా వస్తున్న అద్దె డబ్బులను తాత్కాలికంగా జప్తు చేసింది.ఈ బినామీ ఆస్తి వ్యవహారం అంతా బయటపడటానికి చిన్న గౌడ్ ఇచ్చిన టీవీ, యూట్యూబ్ ఇంటర్వ్యూలే కారణమయ్యాయి. ఏప్రిల్ 3న ఆ ఇంటర్వ్యూలను చూసిన ఐటీ అధికారులు, అతనిపై విచారణ మొదలుపెట్టారు. తనిఖీలు చేసినప్పుడు అతని దగ్గర 900 గ్రాముల బంగారం దొరికితే, అందులో సరైన లెక్కలు లేని 700 గ్రాముల (సుమారు రూ. కోటి విలువైన) బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు.
