చిత్రం లేదు
తెలంగాణTelangana Politics: ఎన్నికలకు రెండేళ్ల ముందే కుర్చీపై కర్చీఫ్.. కానీ సొంత పార్టీలోనే అసలు కుట్రలు!
Telangana Politics: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. సాధారణంగా ఎన్నికలకు ఆరు నెలల ముందో, ఏడాది ముందో హడావిడి మొదలవుతుంది. కానీ జగిత్యాల నియోజకవర్గంలో మాత్రం అప్పుడే పొలిటికల్ హీట్ పీక్స్‌కు చేరింది. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయనే అంచనాలతో ప్రధాన పార్టీల మహిళా నేతలు రెండేళ్ల ముందే కుర్చీపై కర్చీఫ్ వేసే పనిలో పడ్డారు. ఇన్నాళ్లూ పురుషాధిక్య కోటగా ఉన్న జగిత్యాలలో ఈసారి ‘నారీ శక్తి’ ముద్ర వేయాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మహిళా నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే, వీరికి బయటి ప్రత్యర్థుల కంటే సొంత పార్టీ నేతల నుంచే అసలైన కష్టాలు, కుట్రలు ఎదురవుతుండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
