ఏపీ

Janasena: పంచాయతీ ఎన్నికల్లో పూర్తి స్వేచ్ఛ.. సీట్ల సర్దుబాటు లేదు.. జనసేన సంచలన ప్రకటన!

 ఏపీలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు అత్యంత కీలకమైన ప్రకటన విడుదల చేశారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఎవరైనా సరే ఎలాంటి రాజకీయపరమైన అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసి పోటీ చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన మున్సిపల్, పరిషత్ ఎన్నికల తరహాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి పక్షాల మధ్య ఎలాంటి స్థానాల పంపకాలు లేదా సర్దుబాట్లు ఉండవని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆదివారం జనసేన కేంద్ర కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.