ఏపీ
AP: పంచాయతీ ఎన్నికల్లో జనసేన అట్టర్ ప్లాప్.. ఏం చేస్తున్నావ్ పవన్?
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించినప్పటికీ, జనసేన పార్టీ గెలుచుకున్న స్థానాల సంఖ్యపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా వైసీపీ శ్రేణులు, కొందరు రాజకీయ విశ్లేషకులు పంచాయతీ పోరులో జనసేన ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదని, క్షేత్రస్థాయిలో పార్టీకి ఇది ఒక ఎదురుదెబ్బ అని విమర్శలు గుప్పిస్తున్నారు.
