సినిమా

January 12 Vidudala: డబ్బింగ్ స్టార్ట్ చేసిన కళ్యాణ్ రామ్..

January 12 Vidudala: స్టార్ డైరెక్టర్, హిట్ మిషన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జనవరి 12 విడుదల’. ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్‌కు అభిమానుల నుంచి, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అనిల్ రావిపూడి మార్క్ ప్రమోషన్స్‌తో సినిమాపై హైప్ పెంచే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక, తాజాగా చిత్ర బృందం మరో క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. హీరోలలో ఒకరైన నందమూరి కళ్యాణ్ రామ్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ వర్క్ ను మొదలుపెట్టినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.