January 12 Vidudala: స్టార్ డైరెక్టర్, హిట్ మిషన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జనవరి 12 విడుదల’. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 2027, జనవరి సంక్రాంతికి వచ్చే చిత్రాల్లో అందరి దృష్టిని ఎంతగానో ఆకర్షిస్తున్న సినిమాలలో ‘జనవరి 12 విడుదల’ మొదటి స్థానంలో ఉంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.
రీసెంట్గా ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్‌కు అభిమానుల నుంచి, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అనిల్ రావిపూడి మార్క్ ప్రమోషన్స్‌తో సినిమాపై హైప్ పెంచే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక, తాజాగా చిత్ర బృందం మరో క్రేజీ అప్డేట్ ఇచ్చింది. హీరోలలో ఒకరైన నందమూరి కళ్యాణ్ రామ్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ వర్క్ ను మొదలుపెట్టినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
వెంకటేష్, కీర్తి సురేష్, కృతి శెట్టి సహా..మిగిలిన నటీనటులు కూడా త్వరలోనే తమ పాత్రలకి సంబందించిన డబ్బింగ్లో పాల్గొనబోతున్నారు. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ సాహు గారపాటి తన షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే, డి. సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ కలిసి సమర్పిస్తున్నాయి.
ఈ సినిమాకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను భారీ స్థాయిలో పెంచింది. ఇక, ‘జనవరి 12 విడుదల’ సక్సెస్ దర్శకుడు అనిల్ రావిపూడికి 10వ సినిమా. కానీ, ఇందులో నటిస్తున్న హీరోహీరోయిన్లుగా నటిస్తున్న వెంకటేష్, కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టిలకి చాలా కీలకంగా మారింది. వెంకీ గత చిత్రం ఆదర్శకుటుంబం డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. అలాగే, కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి లకి ఈ మధ్య సాలీడ్ హిట్ దక్కలేదు. అందుకే, ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు.
