తెలంగాణ

TG: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఎంపీ లక్ష్మణ్ సంచలన ప్రకటన!

TG: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌పై బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ ఎంపీ కె. లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2029లోనే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా, లోక్‌సభ ఎన్నికలు జరిగే వరకు రాష్ట్రంలో సుమారు 5 నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో మాట్లాడిన ఆయన.. లోక్‌సభ ఎన్నికలకు ఏడాది ముందు లేదా ఏడాది తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలన్నింటికీ 2029లోనే ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు.ఇదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌కి ఎంపీ లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. జీడీపీ ఆధారంగా ఎంపీ సీట్లు పెంచాలని రేవంత్ రెడ్డి కోరడాన్ని ఆయన విమర్శించారు