తెలంగాణ

TG: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఎంపీ లక్ష్మణ్ సంచలన ప్రకటన!

TG: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌పై బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ ఎంపీ కె. లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2029లోనే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా, లోక్‌సభ ఎన్నికలు జరిగే వరకు రాష్ట్రంలో సుమారు 5 నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు.

TG: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌పై బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ ఎంపీ కె. లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2029లోనే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా, లోక్‌సభ ఎన్నికలు జరిగే వరకు రాష్ట్రంలో సుమారు 5 నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో మాట్లాడిన ఆయన.. లోక్‌సభ ఎన్నికలకు ఏడాది ముందు లేదా ఏడాది తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలన్నింటికీ 2029లోనే ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు.

ఇదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌కి ఎంపీ లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. జీడీపీ ఆధారంగా ఎంపీ సీట్లు పెంచాలని రేవంత్ రెడ్డి కోరడాన్ని ఆయన విమర్శించారు. జీడీపీ అనేది ప్రతి ఏటా మారుతూ ఉంటుందని, మరి దానికి తగ్గట్టుగా ప్రతి సంవత్సరం ఎంపీ సీట్లను పెంచడం, తగ్గించడం సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. డీలిమిటేషన్ అనేది ప్రతి పదేళ్లకు ఒకసారి జరిగే ప్రక్రియ అని ఆయన గుర్తు చేశారు.

డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది, ఉత్తరాది అంటూ తారతమ్యాలు సృష్టిస్తున్నారని, అసలు ఈశాన్య రాష్ట్రాల పరిస్థితి ఏంటో చెప్పాలని లక్ష్మణ్ ప్రశ్నించారు. అక్కడ ఒక్కో రాష్ట్రానికి కేవలం ఒక్కో ఎంపీ మాత్రమే ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. భవిష్యత్తులో ఉత్తరాది ప్రజలు జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయాలని ఆందోళనకు దిగితే పరిస్థితి ఏంటని అన్నారు. డిసెంబర్ లోపు డీలిమిటేషన్ బిల్లు పాస్ కాకపోతే, ఆ తర్వాత జనాభాకు అనుగుణంగానే చేయాల్సి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. సీట్లు పెరిగితే ఎస్సీ, ఎస్టీల సీట్లు కూడా పెరిగి, చట్టసభల్లో వాళ్ల గొంతు మరింత బలంగా వినిపిస్తుందని లక్ష్మణ్ పేర్కొన్నారు. గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్, కమ్యూనిస్టులు, మమతా బెనర్జీ శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయారని ఆయన గుర్తు చేశారు.

తర్వాత చదవండి